నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోబుధవారం టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ లాల్ బహదూర్ (బాబు) ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు, జిల్లా పార్టీ కార్యదర్శి చాన్ బాషా పాల్గొన్నారు.




