తణుకు నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లపై కూటమి నేతల సమీక్ష

గ్రామస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

పాల్గొన్న భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజులు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఆదివారం సమీక్ష నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా వివరించాలని కోరారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల వివరాలను చేరవేయాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో తణుకు నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Scroll to Top
Share via
Copy link