:- మంత్రి కందుల దుర్గేష్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన మంత్రి దుర్గేష్
కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని (డిసెంబర్ 6) పురస్కరించుకొని కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ పెద్దల ఆధ్వర్యంలో నిడదవోలు చర్చ్ పేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు, న్యాయవాది జువ్వల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.
నిరంతరం నిడదవోలు పరిశుభ్రత కోసం పాటు పడుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనిది అని, అంబేద్కర్ విగ్రహం ముందు వారిని సన్మానించడం తనకు సంతృప్తినిచ్చిందని మంత్రి దుర్గేష్ అన్నారు. అనంతరం జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులకు, చర్చ్ పేట ఒంటరి మహిళలకు, వృద్ధులకు శ్రీ బూరుగుపల్లి లక్ష్మిపతి గారి జ్ఞాపకార్ధం మరికొంత మంది దాతల సహకారంతో 200మందికి చలి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ నాయకులు, సీఐటీయు నాయకులు కామ్రేడ్ దిద్దే దయామణి, సీఐటీయు నాయకులు కామ్రేడ్ గంటి కృష్ణ జీ డానియల్, జగ్జీవన్ రామ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బైపే రాజేశ్వర రావు, జన విజ్ఞాన వేదిక నాయకులు Y పైడియ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు టీ చిరంజీవి, బి. నాగేశ్వర రావు డి. సుబ్రహ్మణ్యం, పెయింటర్స్ యూనియన్ నాయకులు పి చినబాబు, యు. ప్రభాకర్, టీ ముత్యాల రావు, టీ సుధాకర్, గండి శేఖర్ యూత్ నాయకులు టీ నానీ, టీ నంగాల రాజు, లెనిన్ దాకే కృష్ణ,యు. మోషే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


