ఎమ్మెల్యే కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు, అధికారులు, అభిమానులు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో గురువారం న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం కార్యాలయం ఆవరణలో అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మధ్య కేకు కట్ చేసిన ఆయన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణను తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత ప్రార్ధనలు నిర్వహించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ నేతృత్వంలో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబాల్లో ఆనందం, సంతోషంతో పాటు వారు కోరుకున్న కోరికలు అన్ని సిద్ధించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.


