రోడ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్
కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరగవరం నుండి గొల్లగుంట మీదుగా ఏలేటిపాడు
వెళ్లే రోడ్ ప్రమాదాలకు నిలయమై ఉన్నదని అన్నారు.ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ఆదివారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మునిస్వామి నిరసన తెలియజేశారు. ఈ రోడ్డు గుండా నిత్యం రైతులు వ్యవసాయ ఇతర పనులు కోసం తిరుగుతూ ఉంటారని, విద్యాసంస్థలు స్కూల్ ఆటోలు, వ్యాన్లు, రవాణా వాహనాలు ఎక్కువగా ఈ రోడ్డు ఉండే ప్రయాణాలు సాగుతాయని, ప్రజలు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారని అటువంటి రోడ్డు పాడైపోయి గుంటలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా ఉన్నదని అన్నారు. ఇప్పటికే అనేకమంది ప్రమాదాలకు గురై ఆసుపత్రి ఫాలో అవుతూ వికలాంగుల అవుతున్నారని ప్రాణాపాయ స్థితిలో కూడా ఉంటున్నారని ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోడ్డును వెంటనే నిర్మాణం చేపట్టాలని మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వము ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాలం పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకున్న కనీస అవసరాలను ప్రజలకు తీర్చలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉన్నదని అన్నారు. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజలను ప్రమాదాల బారి నుండి ప్రభుత్వము కాపాడాలని మునుస్వామి ప్రభుత్వానికి కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలే ఉద్యమకారులుగా మారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తారని మునిస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో కే. త్రిమూర్తులు జిత్తిగా రామాంజనేయులు కేత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


