గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

పంచాయతీరాజ్ శాఖలోని రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత

తణుకు నియోజకవర్గంలో రూ. 6.80 కోట్లుతో అభివృద్ధి పనులకు శ్రీకారం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తణుకు మండలం వేల్పూరు గ్రామంలో తణుకు నియోజకవర్గానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన కోట్లు వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో సుమారు 13వేల గ్రామసభలు నిర్వహించి ఒక రికార్డు సృష్టించి ఆయా గ్రామాల్లో ఉన్న అవసరాలు మౌలిక సదుపాయాలను గుర్తచి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్య, తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు దశల కింద రూ. 79 లక్షల వ్యయంతో వేల్పూరు గ్రామంలో రెండు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండే విధంగా ప్రతి ఒక్కరూ భావించాలని ముఖ్యంగా 15 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే తద్వారా నిరంతరాయంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సైతం సహకరించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట పలువురు కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link