ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కార్గో రవాణా సేవలు మరింత విస్తృతం

డోర్ డెలివరీ ద్వారా ప్రజలకు మరింత చేరువ

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

ఆర్టీసీ సంస్థ అందిస్తున్న మరిన్ని మెరుగైన సేవలు సద్వినియోగం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా కార్గో పార్సిల్ -కార్గో రవాణా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. 50 కిలోల వరకు బరువున్న వస్తువులను డోర్ డెలివరీ చేసే సేవలను ఆర్టీసీ సంస్థ చేపట్టిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రధాన నగరాలలో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. తణుకు ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్స్ దాదాపు 6 వేల డోర్ డెలివరీలు చేయడం విశేషమని సహకరిస్తున్న అధికారులను అభినందించారు. మాసోత్సవాల్లో భాగంగా ప్రతి వారం లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు సంస్థలతో పోల్చితే ఆర్టీసీ సంస్థ ఇస్తున్న ధరలు తక్కువగా ఉన్నాయని సమయాన్ని సైతం ఆదా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, ఆర్టిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link