‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీమ్ సందడి

విశాఖపట్నం: డిసెంబర్ 27 (కోస్టల్ న్యూస్)

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’.సినిమా యూనిట్ విశాఖ లో సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన టీమ్ నగరంలో ని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ మలయాళం సినిమా ‘జయ జయ జయహే’కు ఇది రిమేక్. 2022లో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యిందని ఈ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేసి దర్శకుడు ఏఆర్ సజీవ్ తెరకెక్కించరన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. అనంతరం హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్‌ను వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా నటించాం అన్నారు. సినిమా లో హీరో హీరోయిన్ పెళ్లి తర్వాత కథ ఆద్యంతం మలుపు తిరుగుతుందని ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు పందెంకోళ్ల తలపించేట్టుగా దర్శకుడు చూపించన్నారు. దర్శకుడు ఏఆర్ సజీవ్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది అని పక్కాగా ప్రేక్షకుల మనసు దోచుకునే సినిమాగా ఉంటుందని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link