ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం వైసిపి కార్యాలయంలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు, సంక్రాంతి సుబ్బారావు, అద్దేపల్లి విజయ్ కుమార్, కరటూరి కాశి, దువ్వాపు సత్యనారాయణ, నిమ్మన శ్రీనివాస్, మారిశెట్టి నాగేశ్వరరావు, దోనేపూడి సుధాకర్, కరేళ్ల సోంబాబు, పోసిపోయిన రాజేంద్రప్రసాద్, చెన్న సుధాకర్, వై.కృష్ణ, సాధనాల శ్రీనివాసు, గుల్లపూడి దుర్గాప్రసాద్, వై.నారాయణరావు, భారీగా అబిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


