స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 2 An organization for National level Art Competitions (Mumbai) వారు నిర్వహించిన రంగీత్సవ్ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, గ్రీటింగ్ కార్డు తయారి, కలరింగ్, కార్టూన్స్, వ్యంగ్య చిత్రాలు వంటి వివిధ విభాగాలలో 78 మంది పాల్గొనగా ఎస్. భారతో జయలక్ష్మి ద్వితీయ సంవత్సరం (A&T) విద్యార్థిని కాట్టాన్ విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అలాగే 16 మంది విద్యార్థినులు బంగారు పతకాలను, 8 మంది విద్యార్థినులు వెండి పతకాలను, 5 గురు విద్యార్థినులు కాంస్య పతకాలను గెలుచుకున్నారని 30 మంది విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి భూపతిరాజుహిమబిందు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్యఉషారాణి విజేతలను అభినందిస్తూ చదువుతో పాటు కళలలో కూడా విద్యార్థులు మంచి ప్రతిభను కనబరచడం ఆనంద దాయకంగా ఉందన్నారు. విజేతలను కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.


