అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
భారతదేశంలో మొట్టమొదటి పేటెంట్ పొందిన ఫ్రెష్‌పాడ్ సంస్థ ద్వారా హెల్మెట్ క్రిమిసంహారక యంత్రం తయారు చేసిన లక్కోజు దిలీప్‌కుమార్, లక్కోజు భాస్కర్‌లు మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు, టిసిఎస్ చైర్మన్ చంద్ర శేఖరన్ చేత గుర్తింపు పొందారు. బ్రిక్స్ బ్రెజిల్, చైనా, మలేషియాలో వెండి పతకాలు సాధించిన వీరు సెర్బియాలో జరిగిన 38వ అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రదర్శనలో బంగారు పతకం సాధించారు. ముంబైలోని ఆల్ ఇండియా పిచ్చాథాన్Sఎస్‌పీ జైన్ విశ్వవిద్యాలయంలో దక్షిణ భారతదేశం స్టార్టప్ విజేతగా నిలిచారు. హెచ్‌పీసీఎల్ ఇండియా లిమిటెడ్‌తో ఒక ఎంవోయూతో ఒప్పందం చేసుకోవడం అభినందనీయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.


