పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డి. మునిరత్నం నాయుడుకి మంత్రి దుర్గేష్ సూచన
రాజమహేంద్రవరంలోని నివాసంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డి. మునిరత్నం నాయుడు
తొలి వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించిన డి. మునిరత్నం నాయుడుకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన డి. మునిరత్నం నాయుడు మంగళవారం మంత్రి కందుల దుర్గేష్ ను హుకుంపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయన్ను అభినందించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని, తెలుగు భాషా పరిరక్షణకు పాటు పడాలని సూచించారు.విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దుర్గేష్ సూచనలు చేశారు.


