ఉండ్రాజవరం జడ్. పి. హైస్కూల్లో వరల్డ్ డయాబెటిస్ డే అవగాహన సదస్సు

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఉండ్రాజవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు కు, పిల్లలకు, డయాబెటిస్ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం పి.హెచ్. సి. ప్రధాన వైద్యాధికారి డా. దుర్గా మహేశ్వర రావు మాట్లాడుతూ డయాబెటిస్ వ్యాధినే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి అని కూడా అంటారని తెలిపారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండుటనే డయాబెటిస్ అంటారు. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోవను. దీనివల్ల అధిక దాహం, అధిక మూత్రం, విపరీతమైన అలసట, అధిక ఆకలి మొదలగు లక్షణాలు కనిపించును. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే, వారు అవసరమైన పరీక్షలు చేసి, షుగర్ వ్యాధి నిర్ధారణ అయితే, దానిని నియంత్రించుటకు, తగిన మందులు ఇచ్చి, తీసుకునే ఆహారంలో కూడ మార్పులు అనగా ఎటువంటి ఆహారం, ఎంత మోతాదులో, ఏ ఏ సమయంలో తీసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలియ చేస్తారని, తద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణ లో ఉంచుకొనుట ద్వారా ఆరోగ్యం గా ఉండవచ్చు నని తెలియ చేశారు.
జంక్ ఫుడ్స్, అధిక క్రొవ్వు, అధిక తీపి, ఉన్న ఆహార పదార్థాలు ను తీసుకోరాదని తెలియచేశారు. ఈ షుగర్ వ్యాధికి ఉపయోగించే ఇన్సులిన్ మందును కనుగొన్న సర్ ఫెడ్రిక్ బాంటింగ్ యొక్క పుట్టిన రోజైన నవంబర్ 14 వ తేదీన ప్రతీ సంవత్సరం వరల్డ్ డయాబెటిక్ డే గా జరుపుకోవాలని WHO మరియు ఇంటర్ నేషనల్ డియాబెటెక్ ఫెడరేషన్ వారు 1991 వ సంవత్సరం లో నిర్ణయించారు. ఆ కారణంగా ప్రతీ సంవత్సరం నవంబర్ 14 వ తేదీన వరల్డ్ డియాబెటెక్ డే జరుపుకుంటూ, ఈ రోజున స్కూల్ విద్యార్థులు కు, ప్రజలకు, ఈ వ్యాధి లక్షణాలు, రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వచ్చిన తరువాత పాటించవలసిన ఆహార నియమాలు, తీసుకోవలసిన చికిత్సా విధానం గురించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతీ గ్రామము లో గల MLHP లు, ANMs, ఆశా కార్యకర్తలు ద్వారా కూడ ఈ రోజున నిర్వహించామని తెలిపారూ. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం హైస్కూలు ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ గారు, ఇతర ఉపాద్యాయులు, సి.హెచ్.ఓ సుబ్రహ్మణ్యం, పి. హెచ్. ఎన్ కె.డి.వి.ఎల్. కుమారి, సూపర్వైజర్ ఏ. శ్రీరామ మూర్తి, హెల్త్ అసిస్టెంట్ రాము, విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link