విశాఖపట్నం: అక్టోబర్ 19 (కోస్టల్ న్యూస్)
యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ డ్యూడ్ (డ్యూడ్). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ దివాళి టూర్ చేపట్టారు. “డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారనీ హీరో ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సక్సెస్ టూర్ విశాఖలో జరిగింది. రామ టాకీస్, సంఘం శరత్ హాల్లో ఆడియన్స్ తో ముచ్చటించారు.. అనంతరం ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ-“తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి” అని అన్నారు.నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు” అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు.


