బెదిరింపులకు పాల్పడుతున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్

టీడీఆర్ లో ఎటువంటి అవకతవకలు లేవు

మీడియాని ఆశ్రయించిన బాధితులు

విశాఖపట్నం: డాబాగార్డెన్స్: అక్టోబర్ 19 (కోస్టల్ న్యూస్)

వేపగుంట గ్రామంలో మాస్టర్ ప్లాన్ సదుపాయాల కల్పన కోసం జీవీఎంసీ సేకరించిన భూములు ప్రభుత్వ భూములు గానీ, దేవస్థానం భూములు గాని కావని బాధితులు తరుపున గారపాటి శరత్ చంద్ర స్పష్టం చేశారు. నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్క్లప్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తమ నుంచి కొంత ఆశించారని , అయితే తాము తిరస్కరించడంతో తమ భూములకు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డాబాగార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తమ ఆవేదనను వెల్లగక్కారు.టిడిఆర్ పేర్లతో స్వాహా అంటూ ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆక్షన్‌ లోనే బంజరు భూములను తాము కొనుగోలు చేసామన్న విషయాన్ని గుర్తు చేసారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగానే ఉందని తగిన నష్టపరిహారాన్ని ఆశిస్తున్నామని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link