తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శాసనసభ్యులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ జన్మదిన సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అఖిలభారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కటకం రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తనయుడు డా.కందుల కృష్ణ తేజ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి తన తండ్రి అయిన కందుల దుర్గేష్ పట్ల నిడదవోలు నియోజకవర్గం ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో జన్మదిన సందర్భంగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు, రక్తదానం, అన్నదానం నిర్వహిస్తూ ఎంతో ఆదర్శంగా నిలిచారని, అదేవిధంగా ఉండ్రాజవరం మండలంలో జనసైనికులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అదే బాటలో కటకం రామకృష్ణ 200 మంది మహిళలకు చీరలు ఉచితంగా పంచిపెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆయన చేతుల మీదుగా చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద గుమస్తాల సంఘ అధ్యక్షులు కటకం కృష్ణమూర్తి, ఉండ్రాజవరం గ్రామం జనసేన గౌరవాధ్యక్షులు హనుమంతు వెంకన్న, ఉండ్రాజవరం గ్రామ జనసేన వర్కింగ్ ప్రెసిడెంట్ వంగలపూడి శ్రీనివాస్, కే.సావరం గ్రామ ఎంపీటీసీ సభ్యులు కాకర్ల కరుణాకర్, గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ, నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు నిమ్మల సాంబమూర్తి, బండారు అచ్చిబాబు, బలగం సతీష్, తిర్రి రవిదేవ, పసుపులేటి చిన్నారావు, బత్తుల సత్య సాయి నాయుడు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


