
సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు జాతీయ క్షయ వ్యాధినిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాదిగ్రస్తుల గురించి ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ క్యాంప్ డాక్టర్ పైయాజ్ అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధి లక్షణాలు ఎలా వ్యాప్తి చెందుతుంది చికిత్స విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియజేసారు.vularansble population ఉన్న ప్రజలకు లక్షణాలు ఉన్నవారికి కల్లి పరీక్షలు, ఎక్సరే టెస్టులు చేయించారు. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుందని ప్రజలు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని అలాగే ఒక వ్యాధిగ్రస్తుడు సరైన చికిత్స తీసుకోకుండా ఉంటే అతని ద్వారా సంవత్సరానికి 15 మందికి వ్యాధి సోకే అవకాశం ఉందని తెలియజేశారు. రెండు వారాలకు మించి దగ్గు జ్వరం ఆకలి తగ్గడం బరువు కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కల్లెపరీక్ష చేయించుకోవాలని తెలియజేశారు. ఈ సేవలన్నీ ఉచితంగా నిర్వహిస్తారని తెలియజేశారు. టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ నిక్షయ్ మిత్రా గా టీబీ వ్యాధి గ్రస్తులను దత్తత తీసుకొని వారికి పోషకాహార బుట్టలు అందచేశారు. వారికి ఆసుపత్రి సిబ్బంది అందరు అభినందనలు తెలియచేశారు. టీబీ పేషంట్స్ కి పోషకాహార బుట్టలు అందించటానికి దాతలు ముందుకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెహానా, హెడ్ సిస్టర్ హెబ్సీబా, ఎస్ టి ఎస్ ఆర్ పోతురాజు, ఎల్.టి.రాజ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ పుష్ప శివకుమారి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

