తెలుగు భాషా పండితుడు గిడుగు రామ్మూర్తి జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎస్ వి ఎస్ స్కూలు ప్రాంగణంలో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి ఘనంగా శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ బహుభాషా వేత్త సంఘసంస్కర్త తెలుగు భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో సన్మాన గ్రహీత విశ్రాంత గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ మాట్లాడుతూ తెలుగు భాష ఆధునికతకు పరిరక్షణకు కృషి చేద్దామని తెలుగులోనే మాట్లాడదామని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు మన జాతి వెలుగు అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేసినారు. అనంతరం ఎస్ వి ఎస్ స్కూలు డైరెక్టర్ ద్విభాష్యం కేశవరావు, స్కూలు ఉపాధ్యాయులు సరిదే చంద్రకుమారి, కే.కమలేశ్వరి జి అఖిల, షణ్ముఖ ప్రియా, ఎం. షకీనా, కె.పి. శ్రీ నిత్య, బి. బాంధవి, పోలిన దీప్తి, తెలుగు పండితులు వాడపల్లి విశ్వేశ్వరరావు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link