తణుకు వేల్పూరు రోడ్డు న వున్న బి వి ఎస్ పేలస్ నందు శ్రీ మతి వావిలాల సరళా దేవి తణుకు శ్రీ తారకా పురి లైన్స్ క్లబ్ ను 31మంది సభ్యులతో నూతనం గా స్థాపించారు.ఈ క్లబ్ నూతన ప్రెసిడెంట్ గా వావిలాల పవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సెక్రటరీ గా ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ కూమార్, అడ్వకేట్ చోడే గోపికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.
అదేవిధంగా విశిష్ట అతిథులుగా జిల్లా లైన్స్ గవర్నర్ పాపారావు నాయుడు గారు, పాస్ట్ గవర్నర్స్ వంకా రవీంద్రనాథ్ గారు, డాక్టర్ టి సత్యనారాయణ మూర్తి గారు కాకరాల వేణు బాబు గారు, మాది రెడ్డి బాబుజీ రావు,దామెర రంగారావు గారు, గట్టిం మాణిక్యాలరావు ఈ సభలో పాల్గొన్నారు.
ముందుగా నూతన కార్యవర్గం సభ్యులకు డాక్టర్ సి హెచ్ సత్యనారాయణ మూర్తి గారు లైన్స్ క్లబ్ పై అవగాహన కల్పించేరు, అనంతరం వంకా రవీంద్రనాథ్ గారు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తణుకు లో ఈ క్లబ్ స్థాపించిన సరళా దేవి గారు అన్నీ రంగాల్లోనూ ప్రావీణ్యం అనుభవం ఉన్న వ్యక్తి గా ఈ నూతన క్లబ్ కి శ్రీకారం చుట్టి నందుకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ప్రెసిడెంట్ గా పవన్ చక్కని సేవలు అందించాలి అని శాలువా పుష్పగుచ్ఛం తో సన్మానించి అభినందనలు తెలిపారు.
అదే విధంగా క్లబ్ స్థాపించిన సరళా దేవి వెంకట రమేష్ దంపతులను ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ వారి టీమ్ కు అతిథులుగా పాల్గొన్న ప్రతి ఒకరూ31 సభ్యులతో ప్రారంభించిన వావిలాల దంపతులకు అభినందనలు తెలిపారు.
జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు గారు నూతన లైన్స్ సభ్యులకు సర్టిఫికెట్లు, లైన్స్ పిన్స్ బహూకరించి, ప్రెసిడెంట్ టీం కి క్లబ్ సర్టిఫికెట్, బ్యానర్, గ్యాంగ్ అండ్ గెవెల్ మొదలగు అందచేసి సన్మానించారు
ఇంకా కార్యక్రమానికి లైన్స్ నాయకులు అభిమానులు పుట్టా విజయశ్రీ, వి సత్యస్వరూప్,కొరిపల్లి సత్యనారాయణ, వంకా రాజ కుమారి,కోడూరి సత్యనారాయణ ,పి వి రమణ, చీకటి శ్రీనివాస్, బూరుగుపల్లి శేషారావు, డాక్టర్ సత్యవతి సుంకవల్లి చిరంజీవి, చీకటి శ్రీనివాస్, కె శ్యామల, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల రమణ,అ సత్యనారాయణ వింజమూరి సుబ్రహ్మణ్యం, తది తర లైన్ నెంబర్స్ , సన్యాసి రావు, సప్పారాజ తదితరులు పాల్గొన్నారు.


