ఉండ్రాజవరం మండలం వెలగదుర్రులో బుధవారం రూ.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ భవనం రూ.10 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, రూ.4 లక్షల జడ్పీ నిధులు, రూ.5 లక్షల ఎంపీపీ నిధులు, రూ.5 లక్షల జడ్పీపీ నిధులతో నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు భారత రాజ్యాంగ రూపకర్త డా|| బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, గ్రామ టిడిపి అధ్యక్షులు ముదునూరి రవీంద్ర రాజు, పాతూరి నరేంద్ర బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


