టిడిపి తీర్థం పుచ్చుకున్న ఇద్దరు వార్డు సభ్యులు

అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు బుధవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యులు మల్లుల వరలక్ష్మి, పదో వార్డు సభ్యులు వీరమళ్ల నాగవేణిలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. గత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఎమ్మెల్యే రాధాకృష్ణ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు

Scroll to Top
Share via
Copy link