తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్ర ప్రతిష్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం శివ ముక్కోటి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం, శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించినట్లు అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలియజేశారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో శనివారం ఉదయం నుండి భక్తులు విచ్చేసి స్వామివారి రుద్రాభిషేకం అమ్మవారి కుంకుమ పూజలు తిలకించారు.




