విశాఖపట్నం :
2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై విశాఖలోని మధురవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘2017కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులు 1.51 కోట్లకు పెరిగారు. 2018 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2025లో రూ.22.08 లక్షల కోట్లు వచ్చింది. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.




